Vijayanirmla: నిర్మల.. విజయనిర్మల ఎలా అయ్యారంటే..!

  • చిత్రపరిశ్రమలో తొలిసారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్
  • కృతజ్ఞతగా పేరు ముందుకు ‘విజయ’ను చేర్చుకున్న నిర్మల
  • చిత్రపరిశ్రమలో ఎదురులేని నటిగా గుర్తింపు
ప్రముఖ నటి, సీనియర్ నటుడు కృష్ణ భార్య విజయ నిర్మల బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాలనటిగా ఏడో ఏటనే సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల అసలు పేరు నిర్మల. అయితే, తనకు సినీ పరిశ్రమలో తొలిసారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్‌ పట్ల కృతజ్ఞతగా తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. దీనికితోడు మరో సీనియర్ నటి నిర్మలమ్మ అప్పటికే చిత్రపరిశ్రమలో ప్రముఖ నటిగా ఉండడం కూడా విజయనిర్మల తన పేరు మార్చుకోవడానికి మరో కారణం. వివిధ భాషల్లో 200పైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల ఎదురులేని నటిగా గుర్తింపు పొందారు.
Vijayanirmla
Tollywood
Krishna
dead
Nirmala

More Telugu News