Lanka Dinakar: ఈసారి అధికార ప్రతినిధి వంతు... టీడీపీని వీడి బీజేపీలో చేరిన లంక దినకర్

  • టీడీపీ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు
  • జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకున్న లంక
  • రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపిన లంక
టీడీపీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందూవెనుకా కాస్త గట్టిగానే గళం వినిపించిన టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో లంక కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. లంక దినకర్ కొంతకాలంగా టీడీపీ తరఫున శక్తిమేర గొంతుక వినిపించారు. అనేక అంశాలపై టీడీపీ వైఖరిని చాటడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా బదులిచ్చేవారు.  
Lanka Dinakar
Chandrababu
Telugudesam

More Telugu News