Kiwis: కివీస్ ను ఆదుకున్న ఆల్ రౌండర్లు

  • 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
  • నీషామ్, గ్రాండ్ హోమ్ సెంచరీ భాగస్వామ్యం
  • షహీన్ కు మూడు వికెట్లు

పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆల్ రౌండర్లే ఆపద్బాంధవుల్లా మారారు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ను నీషామ్, గ్రాండ్ హోమ్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. 45 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నీషామ్ 69, గ్రాండ్ హోమ్ 50 పరుగులు సాధించారు. మిగిలిన ఐదు ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టాలని కివీస్ భావిస్తోంది. అంతకుముందు, పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది విజృంభించడంతో న్యూజిలాండ్ టాపార్డర్ కకావికలమైంది. షహీన్ 3 వికెట్లు తీశాడు.

More Telugu News