Andhra Pradesh: ప్రజావేదిక కూల్చివేత కాదు, తొలగింపు మాత్రమే: మంత్రి పేర్ని నాని

  • ప్రజావేదికను కూల్చివేస్తున్నామనడం కరెక్టు కాదు
  • ప్రజాధనమేమీ వృథా కావట్లేదు
  • సెక్రటేరియట్ సమీపంలో తిరిగి నిర్మిస్తాం

అక్రమకట్టడం ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్న తరుణంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజావేదికను కూల్చివేస్తున్నామని, ధ్వంసం చేస్తున్నామని అనడం కరెక్టు కాదని, దాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. ఐరన్, రేకులతో నిర్మితమైన ప్రజావేదికను డిస్ మాంటిల్ చేస్తున్నామని, సెక్రటేరియట్ సమీపంలో ప్రభుత్వ స్థలంలో తిరిగి నిర్మిస్తామని, ఈ వస్తువులను ఉపయోగించుకుంటామని చెప్పారు. కనుక, ప్రజాధనం వృథా కావడం లేదని స్పష్టం చేశారు.

ప్రజావేదిక నిర్మాణానికి నాలుగు కోట్లు కూడా చెయ్యదని, అటువంటి వేదిక నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిపుణులు చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.

More Telugu News