Andhra Pradesh: ఓర్వలేనితనంతోనే జగన్ ప్రజావేదికను కూల్చేస్తున్నారు!: టీడీపీ ఏపీ చీఫ్ కళా వెంకట్రావు

  • ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
  • జగన్ చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలి
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఓర్వలేనితనంతోనే ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి వెళుతున్న సందర్భంగా కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజావేదిక ఆధారంగా సీఎం జగన్ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. సీఎం జగన్ చేస్తున్న చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మరోపక్క, సీఆర్డీఏ కమిషనర్, మంగళగిరి రామకృష్ణారెడ్డి ప్రజావేదిక కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
kala venkatrao
praja vedika

More Telugu News