Andhra Pradesh: ప్రజావేదిక వద్ద రాత్రికిరాత్రి విధ్వంసం సృష్టించారు.. ఫర్నీచర్ ను వేలంపాటలో అమ్ముకోండి!: కాల్వ శ్రీనివాసులు

  • రాత్రికిరాత్రి కూల్చాల్సిన అవసరం ఏమిటి?
  • అన్ని వసతులు ఏర్పాటయ్యే వరకూ వాడుకోవచ్చు కదా
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
అమరావతిలో ప్రజావేదికను రాత్రికిరాత్రే కూల్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ నేతల కాల్వ శ్రీనివాసులు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి అన్ని వసతులు ఏర్పడేవరకూ ప్రజావేదికను వాడుకోవచ్చు కదా? అని అడిగారు. ప్రజావేదిక వద్ద రాత్రికి రాత్రి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజావేదికలోని ఫర్నీచర్ ను వేలంపాటలో అమ్ముకోవాలని వ్యంగ్యంగా అన్నారు.

అమరావతిలో ఈరోజు చంద్రబాబుతో భేటీకి వెళుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telugudesam
kaluva
srinivasulu
amaravati

More Telugu News