three year old baby: పాపం పసివాడు... వేడి కూరలో పడి మృత్యువాత!

  • ఆడుకుంటూ వచ్చి కూరపాత్రలోకి బోల్తా
  • భోజనానికి ముందు ఘటన
  • ఔరంగాబాద్‌లో విషాదం
అభం శుభం తెలియని ఓ చిన్నారి వేడిగా ఉన్న కూరలో పడి ప్రాణం పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది. వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరం చికల్‌రాణా ప్రాంతంలోని పుష్పక్‌ గార్డన్‌ సమీపంలో సంతోష్‌గాదూ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ సభ్యుల కోసం సోమవారం రాత్రి భోజనం సిద్ధం చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల్లో భాగంగా తయారు చేసిన కూరను పక్కన పెట్టారు.

అదే సమయంలో సంతోష్‌ కొడుకు హర్షల్‌ (3) సమీపంలో అడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ వెళ్లి వేడి కూరలో పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరుమన్నారు.
three year old baby
died in accident
ourangabad

More Telugu News