kodikathi: జగన్ పై దాడి కేసు.. నేడు కోర్టుకు హాజరుకానున్న శ్రీనివాసరావు

  • విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
  • బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టును కోరనున్న అధికారులు
  • 2018 అక్టోబర్ 25న జగన్ పై దాడి
విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు నేడు కోర్టుకు హాజరుకానున్నాడు. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ అధికారులు కోర్టును కోరనున్నారు. 2018 అక్టోబర్ 25న జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాదుకు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయనపై దాడి జరిగింది. దాడిలో గాయపడ్డ జగన్ హైదరాబాదులో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
kodikathi
srinivasa rao
jagan
nia
court

More Telugu News