rtgs: కృష్ణా, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
  • సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ సూచన
పిడుగులు పడే అవకాశం ఉందంటూ కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవి, పామర్రు, అవనిగడ్డ, మొవ్వ, చల్లపల్లి, ఘంటసాల, నూజివీడు, ముదినేపల్లి ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గుంటూరు జిల్లాలో రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో కూడా పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపింది.
rtgs
thunder
krishna
guntur

More Telugu News