ప్రజావేదిక ప్రహరీగోడను కూల్చివేస్తున్న సిబ్బంది!

25-06-2019 Tue 21:55
  • జేసీబీలతో కొనసాగుతున్న కూల్చివేత పనులు
  • ఇప్పటికే అక్కడి క్యాంటీన్ ను కూల్చేసిన సిబ్బంది
  • ప్రజావేదిక దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజావేదికలోని ఏసీలు, మైకులు, ఇతర సామగ్రిని తరలించారు. జేసీబీల సాయంతో ప్రజావేదిక ప్రహరీగోడను కూల్చివేస్తున్నారు. అంతకుముందు, అక్కడి క్యాంటీన్ ను కూల్చివేశారు. ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రజావేదిక, కరకట్టను భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతను సీఆర్డీఏ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెల్లవారే సరికి ప్రజావేదిక నేలమట్టం కానుంది.