Pudi Srihari: ఏపీ ముఖ్యమంత్రి సీపీఆర్వోగా పూడి శ్రీహరి నియామకం

  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
  • ప్రభుత్వ సలహాదారుకు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశం
  • సీఎం జగన్ టీమ్ లో మరో కీలక అధికారి చేరిక
ఏపీ సర్కారుకు సంబంధించి మరో కీలక నియామకం జరిగింది. సీఎం జగన్ టీమ్ లో మరో సభ్యుడు చేరారు. ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) గా పూడి శ్రీహరిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామక విధివిధానాలను మరో ఉత్తర్వులో పేర్కొననున్నారు.

ఈ నియామకాన్ని అనుసరించి పూడి శ్రీహరిని వెంటనే ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. పూడి శ్రీహరి వృత్తిరీత్యా జర్నలిస్టు. అయితే, గత రెండేళ్లుగా జగన్ కు సంబంధించిన మీడియా వ్యవహారాలను పర్యవేక్షించడమే కాకుండా, పాదయాత్ర ఆసాంతం జగన్ వెన్నంటి నిలిచారు. ఈ కారణంగానే పూడి శ్రీహరికి కీలకమైన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి పదవి వరించినట్టు తెలుస్తోంది.
Pudi Srihari
Jagan
CPRO
Andhra Pradesh

More Telugu News