aishwarya rajesh: 'కౌసల్య కృష్ణమూర్తి' నుంచి బ్యూటిఫుల్ సాంగ్

  • తమిళంలో హిట్ కొట్టిన 'కణ'
  • తెలుగు రీమేక్ గా 'కౌసల్య కృష్ణమూర్తి'
  • జూలై 2వ వారంలో విడుదల  

తమిళంలో ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా చేసిన 'కణ' చిత్రం, క్రితం ఏడాది ఘన విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. దాంతో ఐశ్వర్య రాజేశ్ తోనే తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేశారు. 'కౌసల్య కృష్ణమూర్తి' టైటిల్ తో ఈ సినిమాను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించాడు. కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను జూలై 2వ వారంలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'ముద్దబంతి' అనే పాటను విడుదల చేశారు. తమిళంలో 'ఒతాయాడి .. ' అంటూ సాగే ట్యూన్ లోనే ఈ 'ముద్దబంతి' పాట సాగుతుంది. తమిళ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్ల వ్యూస్ ను సాధించడం విశేషం.  సూపర్ హిట్ అయిన ఆ పాట .. తెలుగులోనూ యూత్ హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News