brian lara: బ్రియాన్ లారాకు అస్వస్థత.. ముంబైలోని ఆసుపత్రికి తరలింపు

  • ఛాతీ నొప్పితో బాధపడ్డ లారా
  • పరేల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలింపు
  • కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ ను టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ కు బ్రియాన్ లారా క్రికెట్ ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన ముంబైలో ఉంటున్నారు. కాసేపట్లో లారా ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ వైద్యులు ప్రకటన చేయనున్నారు.

టెస్టుల్లో 400 పరుగుల స్కోరు చేసిన రికార్డు 50 ఏళ్ల లారా పేరిటే ఉంది. టెస్టుల్లో 11,953 పరుగులు చేసిన లారా... వన్డేల్లో 10,405 రన్స్ చేశారు. 131 టెస్టులు, 299 వన్డేల్లో లారా ఆడాడు.

More Telugu News