Kollywood: పిల్లాడి స్కూల్ ఫీజ్ కట్టేందుకు డబ్బులేక... సినీ కాస్ట్యూమర్ బలవన్మరణం!

  • కోలీవుడ్ లో పనిచేస్తున్న వెంకట్రామన్
  • ఎవరిని అడిగినా డబ్బు దొరక్కపోవడంతో మనస్తాపం
  • ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య
ఏడవ తరగతి చదువుతున్న కుమారుడి స్కూల్ ఫీజ్ కట్టలేని స్థితిలో, కోలీవుడ్ లో కాస్ట్యూమర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నై, కోడంబాక్కమ్ ప్రాంతంలో వెంకట్రామన్‌ (45) అనే సినీ కాస్ట్యూమర్‌ కుటుంబం ఉంటోంది. ఇటీవలి కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. నెలకు రెండు రోజుల పని కూడా దొరకడం లేదు. దీంతో భార్య నగలను విక్రయించి, కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. అప్పులు చేశాడు. వెంకట్రామన్ చిన్న కొడుకు 7వ తరగతి చదువుతుండగా, స్కూల్ పీజు కట్టడానికి డబ్బు అవసరమైంది. ఎవరిని అడిగి చూసినా డబ్బు దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన, ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వడపళని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.
Kollywood
Sucide
Chennai
Tamilnadu

More Telugu News