Prakasam District: ఉలవపాడు ఎస్‌బీఐలో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

  • ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు
  • దగ్ధమైన ఫర్నిచర్, కంప్యూటర్లు
  •  షార్ట్ సర్క్యూటే కారణం?
ప్రకాశం జిల్లా ఉలవపాడులోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Prakasam District
ulavapadu
Andhra Pradesh
SBI
Fire Accident

More Telugu News