congress: ప్రధాని మోదీకి ఇబ్బంది కల్గి ఉంటే క్షమాపణలు: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్

  • ‘నాలి’ అనే పదాన్ని నేను ఉపయోగించలేదు  
  • నాకు ‘హిందీ’ సరిగా రాదు
  • ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు
లోక్ సభా వేదికగా ప్రధాని మోదీని ‘మురికి కాల్వ’తో పోల్చిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిర్ రంజన్ స్పందించారు. ‘నాలి’ (కాల్వ) అనే పదాన్ని తన ప్రసంగంలో ఎక్కడా వినియోగించలేదని, తనకు ‘హిందీ’ సరిగా రాదని, తన ‘హిందీ’ అంత బాగుండదని చెప్పి సమర్థించుకున్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ప్రధాని మోదీకి ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు.
congress
mp
adhir ranjan
modi
pm

More Telugu News