Election Result: బీజేపీలో చేరడానికి సిద్ధమైన టీఎంసీ కౌన్సిలర్లు.. వార్నింగ్ ఇచ్చిన పార్టీ!

  • బీజేపీలోకి వెళ్లేందుకు 18 మంది కౌన్సిలర్లు సిద్ధం
  • నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధిష్ఠానం
  • పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిక

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో చేరిపోతారో తెలియని పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీగా స్థానాలను గెలుచుకున్న అనంతరం ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే ఈ ఆకర్ష్‌కు పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకోగా మరికొందరు క్యూలో ఉన్నారు.

అయితే.. ఈసారి 18 మంది కౌన్సిలర్లు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ  విషయం తెలుసుకున్న అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. పార్టీ మారితే తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయని అధిష్ఠానం బెదిరింపులకు పాల్పడింది. ఏ పార్టీలోకి వెళ్లినా సరే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే తాట తీస్తామని టీఎంసీ అధిష్ఠానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి, తృణముల్ వార్నింగ్‌ను లెక్క చేస్తారా? లేకుంటే కమలం గూటికి వెళ్లిపోతారా..? అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాలి.

More Telugu News