Andhra Pradesh: మీ వాళ్లు మా పార్టీలో చేరితే మా మీద విషం కక్కడం ఎందుకు?: టీడీపీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

  • బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు
  • విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు
  • టీడీపీ విమర్శలకు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్
టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని ఈ నలుగురు నేతలు బీజేపీలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎన్నడూ చట్టసభల నియమనిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని ఆయన తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ..‘బీజేపీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. మీ(టీడీపీ) సభ్యులు మా పార్టీలో చేరితే మా మీద విషం కక్కడం ఎందుకో అర్థం కావడం లేదు. తప్పు అంతా రాహుల్ గాంధీలో, తెలుగుదేశం పార్టీ దగ్గర పెట్టుకుని మీడియా ముందు ఏడవడం ఎందుకు?’ అని విమర్శించారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
vishnuvardhan reddy
Twitter

More Telugu News