టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్!
- నాపై తప్పుడు కథనాలు రాస్తున్నారు
- బోధన్ ఫ్యాక్టరీని పట్టించుకోవడం లేదంటున్నారు
- నేనేమీ కండకావరం ఎక్కిన దొరను కాదు
అనంతరం మరుసటి రోజున ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో వీరంతా మరోసారి తనను కలిశారనీ, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా కోరారని చెప్పారు. రైతులను, కార్మికులను పట్టించుకోకుండా ఉండటానికి తాను కండకావరం ఎక్కిన దొరను కాదని స్పష్టం చేశారు.
తాను ప్రజా సేవకుడి సైన్యంలో ఓ సేవకుడిని అని చెప్పారు. ప్రజల రక్తం తాగి, పాపపు సొమ్ముతో నడిచే ఓ దినపత్రికను, దాంట్లో వచ్చే పిచ్చి రాతలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిల్లర కథనాలు రాసేముందు తనను ఫేస్ బుక్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలని అరవింద్ సూచించారు.