India: టీమిండియా మ్యాచ్ కు వర్షం వస్తే హడలిపోతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు!

  • భారత్ ఆడే మ్యాచ్ లకు కవరేజి బీమా పాలసీ తీసుకున్న ప్రసారకర్తలు
  • ఒక్కో మ్యాచ్ కు రూ.100 కోట్ల బీమా
  • చెల్లించే ప్రీమియం కంటే క్లెయిమ్ అనేక రెట్లు అధికం!

మార్కెటింగ్ పరంగా టీమిండియాను కొట్టే జట్టు మరొకటి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీమిండియా మ్యాచ్ నిర్వహించినా కాసుల వర్షం కురుస్తుంది. దాంతో వాణిజ్య ప్రకటనల టారిఫ్ కూడా ఆకాశాన్నంటుంది. ఇక వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లంటే చెప్పేదేముంది? ఒక్కో మ్యాచ్ కు రూ.50 కోట్ల వరకు గరిష్టంగా ఆదాయం వచ్చిపడుతుంది. అందుకే భారత జట్టు ఆడే మ్యాచ్ లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రసారకర్తలు ముందుగానే కవరింగ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు.

ఈ లెక్కన వరల్డ్ కప్ లో టీమిండియా ఆడే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తిపుణ్యానే వందకోట్లంటే ఎవరికైనా కష్టమే! అందుకే పేరుమోసిన బీమా సంస్థలు సైతం వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లో వర్షం అంటే హడలిపోతున్నాయి. వర్షం రాకూడదనే కోరుకుంటున్నాయి. మ్యాచ్ ప్రసారకర్తలు చెల్లించే ప్రీమియం కంటే క్లెయిమ్ చేసే మొత్తం అనేకరెట్లు ఎక్కువగా ఉండడమే ఇన్సూరెన్స్ కంపెనీల ఆందోళనకు ప్రధాన కారణం.

More Telugu News