Geetha Madhuri: గీతామాధురి సీమంతం... సిగ్గులు, ఆనందాలు, భావోద్వేగాలతో వీడియో

  • 2014లో నందూతో గీత వివాహం
  • ఘనంగా సీమంతం
  • హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
టాలీవుడ్ గాయని గీతామాధురి త్వరలోనే తల్లికాబోతోంది. గీతామాధురికి తాజాగా సీమంతం నిర్వహించారు. భర్త నందు, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గీతకు ఘనంగా సీమంతం లాంఛనాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. గర్భవతిగా ఉన్న గీతామాధురి ఈ వీడియోలో కాస్తంత సిగ్గుపడుతూ, మరికొన్నిచోట్ల ఆనందంతో పొంగిపోతూ, భావోద్వేగాల జల్లులో తడిసిముద్దవుతూ కనిపించింది. ఈ కార్యక్రమంలో గీతామాధురి మిత్రులైన యాంకర్ శ్యామల, ఇతర గాయనీమణులు అంజనా సౌమ్య, మాళవిక కూడా దర్శనమిచ్చారు. కాగా, గీతామాధురికి నటుడు నందూతో 2014లో వివాహం జరిగింది. ఇన్నాళ్లకు అమ్మడు తల్లికాబోతుండడంతో కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Geetha Madhuri
Singer
Seemantham
Nandu
Tollywood

More Telugu News