Nadigar: ముగిసిన ‘నడిగర్’ ఎన్నికలు..ఓటు వేయలేకపోయిన రజనీకాంత్!

  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • యాభై శాతం మందే ఓటింగ్ లో పాల్గొన్నారట
  • షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్న రజనీకాంత్  

చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కోర్టు తీర్పు అనంతరం ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
నడిగర్ ఎన్నికల్లో చాలా మంది నటులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని సమాచారం. యాభై శాతం మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. నేరుగా ఓటు వేసేందుకు రాలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ప్రముఖ నటుడు రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తారని అందరూ భావించారు. కానీ, ‘దర్బార్’ షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్న కారణంగా రజనీకాంత్ రాలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా రజనీ ఓటు వేయలేకపోవడం గమనార్హం.

More Telugu News