world cup: ప్రపంచ కప్..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

  • తలపడనున్న పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు
  • లార్డ్స్ వేదికగా జరగనున్న మ్యాచ్
  • విజయం కోసం ఇరు జట్లు పోటీ

ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో టోర్నీలో వెనుకంజలో ఉన్న ఇరు జట్లు ఈ పోరులో విజయం సాధించేందుకు పట్టుదలతో ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఆడిన  ఆరు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కాగా, ఒక మ్యాచ్ రద్దయింది. పాకిస్థాన్ విషయానికొస్తే, ఈ జట్టు ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒకటి గెలవగా మూడిట్లో  ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. ఈ రెండు జట్లు చెరో మూడు పాయింట్లతో ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News