Guntur District: నా ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతా: యరపతినేని శ్రీనివాసరావు

  • నేను పార్టి మారే ప్రసక్తే లేదు
  • టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి
  • పార్టీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గురజాల టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన యరపతినేని శ్రీనివాసరావు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీని వీడుతున్నారన్న వదంతులపై ఆయన స్పందించారు. ‘నేను పార్టి మారే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. పల్నాడులో ఫ్యాక్షన్ నిర్మూలనకు వైసీపీ కలిసి రావాలని కోరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉందని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. పది గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు గ్రామాలను వదిలి వెళ్లిపోయారని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని యరపతినేని కోరారు.
Guntur District
Gurazala
Telugudesam
Yarapatineni

More Telugu News