america: కుప్పకూలిన పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థ విమానం : 11 మంది మృతి

  • అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఘటన
  • మృతుల్లో సిబ్బంది, ప్రయాణికులు
  • బయలుదేరిన కాసేపటికే కుప్పకూలిన విమానం
ఓ పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థకు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిల్లింగ్హమ్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ విమానం కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు దుర్మరణం పాలయినట్లు అధికారులు తెలిపారు. విమానం ఓహు పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థకు చెందినదని వివరించారు. ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
america
airoplane crashed
11 died

More Telugu News