Tourist boat: బోటులో వెళ్తున్న వారిపై బ్రిడ్జిపై నుంచి మూత్రం పోసిన వ్యక్తి.. పలువురికి గాయాలు!

  • జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘటన
  • మూత్రం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకిన టూరిస్టులు
  • బోటు తగిలి తలలకు తీవ్ర గాయాలు
బ్రిడ్జిపై నిల్చున్న వ్యక్తి కింది నుంచి వెళ్తున్న టూరిస్టు బోటుపై మూత్రం పోసిన ఘటనలో పలువురు పర్యాటకులు గాయపడ్డారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిందీ ఘటన. జన్నోవిజ్ బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న బోటుపై పై నుంచి ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంతో తప్పించుకునేందుకు పర్యాటకులు ఒక్కసారిగా కిందికి దూకారు. దీంతో వారి తలలు బోటుకు తాకడంతో బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న బెర్లిన్ అగ్నిమాపకశాఖ సిబ్బంది తెలిపారు. నీటిలోకి దూకిన మరికొందరు స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్నారు.

మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు.
Tourist boat
Germany
berlin
Urine

More Telugu News