Central Budget: బడ్జెట్ హల్వాను అందరికీ వడ్డించిన నిర్మలా సీతారామన్

  • ముద్రణకు ముందు హల్వాను వండుతారు
  • నేడు లాంఛనంగా ప్రారంభమైన బడ్జెట్ కార్యక్రమాలు
  • కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్
కేంద్ర బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను వండటం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఆర్థిక శాఖ కార్యాలయంలో నేడు ‘హల్వా వేడుకను నిర్వహించారు. తొలిసారిగా లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వేడుకను ప్రారంభించి అందరికీ హల్వా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.
Central Budget
Nirmala Sitharaman
Halwa
Anurag Takur
Loksabha

More Telugu News