Jagan: ఆర్ధికశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం... బడ్జెట్ రూపకల్పనపై కసరత్తులు

  • అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న సీఎం
  • నవరత్నాలు, ప్రాజక్టులకు నిధుల సమీకరణపైనా సమీక్ష
  • హాజరైన మంత్రి బుగ్గన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. మరికొన్నిరోజుల్లో రాష్ట్ర ప్రధాన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనపై అందరి అభిప్రాయాలను తీసుకుంటున్న సీఎం జగన్, నవరత్నాలు, ప్రాజక్టులకు నిధుల సమీకరణఫైనా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏ రంగానికి ఎంతమేర కేటాయింపు చేయాలన్న విషయాలను కూడా జగన్ ఆర్థికమంత్రితో చర్చించారు. బడ్జెట్ మొత్తం నిర్ధారించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కూడా జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు ప్రారంభిస్తే రాష్ట్రంపై పడే భారం ఎంత అని ప్రత్యేకంగా అడిగినట్టు తెలుస్తోంది.
Jagan
Andhra Pradesh
Budget

More Telugu News