Tollywood: హీరో నితిన్ కు ట్రాఫిక్ కష్టాలు.. మెట్రోను ఆశ్రయించిన నటుడు!

  • ట్రాఫిక్ లో చిక్కుకున్న నితిన్ వాహనం
  • మెట్రోలో ఎక్కినట్లు ఫేస్ బుక్ లో తెలిపిన నటుడు
  • నితిన్ తో సెల్ఫీ కోసం ఎగబడ్డ ప్రయాణికులు

ప్రముఖ టాలీవుడ్ నటుడు నితిన్ కు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నితిన్ కారు హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దీంతో నితిన్ మెట్రో రైలును ఆశ్రయించాడు. ఈ విషయమై నితిన్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ..‘రోడ్లపై చాలా ట్రాఫిక్ ఉంది. దీంతో ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మెట్రోను ఆశ్రయించా. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ తో సెల్ఫీల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. నితిన్, రష్మిక జంటగా ప్రస్తుతం ‘భీష్మ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.

More Telugu News