TTD: శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరిన వైవీ సుబ్బారెడ్డి

  • టీటీడీ కొత్త చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
  • తిరుమలలో రేపు ప్రమాణస్వీకారం
  • తిరుచానూరులో అమ్మ వారిని దర్శించుకున్న సుబ్బారెడ్డి, కుటుంబసభ్యులు
టీటీడీ కొత్త చైర్మన్ గా వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తిరుపతి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మ వారిని దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల కొండపైకి సుబ్బారెడ్డి బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, టీటీడీ కొత్త బోర్డు సభ్యుల నియామకం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. 
TTD
chairman
YV Subba Reddy
Sri varu

More Telugu News