Undavalli: ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • ప్రజావేదిక అక్రమ కట్టడమని వైసీపీ నేతలే చెప్పారు
  • ఆ కట్టడాన్ని కూల్చకుండా ఎలా తీసుకుంటుంది?
  • ప్రజావేదికను చంద్రబాబుకు ఇచ్చే అవకాశం లేకపోతే స్పష్టంగా చెప్పాలి
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రజావేదిక తనకు కేటాయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు అడిగారని, దానికి ఇప్పటి వరకూ సమాధానం లేదని అన్నారు. ప్రజావేదికను చంద్రబాబుకు ఇచ్చే అవకాశం లేకపోతే ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ప్రజావేదిక అక్రమ కట్టడమని వైసీపీ నేతలే చెప్పారని, అలాంటప్పుడు, ఆ కట్టడాన్ని కూల్చకుండా ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరినే తాము తప్పుపడుతున్నామని అశోక్ బాబు అన్నారు.
Undavalli
Chandrababu
prajavedika
Ashok Babu

More Telugu News