Talasani: ట్రైబ్యునల్‌లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పడుతుంది: తలసాని

  • కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే
  • ప్రాజెక్టు పూర్తవడంతో కేసీఆర్ కల సాకారమైంది
  • ప్రాజెక్టు పూర్తవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు
ట్రైబ్యునల్‌లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్ని కేసీఆరేనని, ఈ ప్రాజెక్టుతో ఆయన కల సాకారమైందన్నారు. తెలంగాణ రావడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలని, వీటిలో నీటి కల సాకారమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తలసాని తెలిపారు. నేటి వరకూ తెలంగాణ నీటి సమస్యకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పరిష్కారం చూపలేకపోయిందన్నారు.
Talasani
KCR
Kaleswaram
Projects
Telangana
Brijesh Kumar Tribunal

More Telugu News