Chandrababu: టీడీపీకి షాక్.. ఉండవల్లిలోని ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

  • ప్రజావేదికను కేటాయించాలని జగన్‌కు చంద్రబాబు లేఖ
  • సామగ్రిని తీసివేయాలని టీడీపీ నేతలకు సూచన
  • కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయం
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను తమకు కేటాయించాలని ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. దానిని పట్టించుకోని ప్రభుత్వం నేడు దానిని స్వాధీనం చేసుకుంది. అందులో ఉన్న సామగ్రిని వెంటనే తీసివేయాలని టీడీపీ నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు.

అయితే ప్రస్తుతం చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నారని, ఈ సమయంలో ప్రజావేదిక భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని టీడీపీ నేతలు తెలిపారు. ఇదిలావుండగా, ఈ నెల 24న కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజావేదిక వద్దకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే అధికారులు వచ్చి పరిశీలించారు.
Chandrababu
Vundavalli
Europe
Jagan
Prjavedika

More Telugu News