Andhra Pradesh: తెలంగాణలో అందువల్లే టీడీపీ దెబ్బతింది.. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి పునరావృతం కాదు!: బుద్ధా వెంకన్న

  • టీడీపీ అన్నది కార్యకర్తల పార్టీ
  • వైసీపీ తర్వాత అధికారంలోకి వస్తాం
  • నేను లేకపోయినా ప్రజలు చంద్రబాబును బలపరుస్తారు
తెలుగుదేశం నాయకుల పార్టీ కాదనీ, కార్యకర్తల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో టీడీపీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారని చెప్పారు. అందుకే అక్కడ పార్టీ దెబ్బతినిందని వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో టీడీపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారనీ, కాబట్టి పార్టీకి ఎలాంటి నష్టం జరగదని అభిప్రాయపడ్డారు.

ఓ టీవీ ఛానల్ కు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుద్ధా వెంకన్న మాట్లాడారు. రాజకీయాలు అన్నవి ఓ క్రమపద్ధతిలో చక్రంలా కొనసాగుతాయని బుద్ధా వెంకన్న తెలిపారు. తమిళనాడులో ఓసారి అన్నాడీఎంకే, మరోసారి డీఎంకేకు అధికారం అప్పగించినట్లు ఏపీలో వైసీపీ తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రేపు తాను లేకపోయినా ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తారని స్పష్టం చేస్తారు.
Andhra Pradesh
Telugudesam
budha venkanna
YSRCP

More Telugu News