ED: ఈడీ, సీబీఐ కేసులున్నవారు బీజేపీలోకి వచ్చినా విచారణను ఎదుర్కోవాల్సిందే: విష్ణువర్ధన్‌రెడ్డి

  • బీజేపీలోకి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు
  • కేసుల నుంచి తప్పించుకోవడానికేనంటూ విమర్శలు
  • ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తామేనన్న విష్ణువర్ధన్‌రెడ్డి
ఈడీ, సీబీఐ కేసులున్న టీడీపీ నేతలు బీజేపీలోకి వచ్చినప్పటికీ ఆ విచారణను ఎదుర్కోవలసిందేనని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నేడు నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వీరు కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ, ఆరోపణలు ఉన్నవారు బీజేపీలోకి వచ్చినా విచారణను మాత్రం ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. ఇకపై  ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తామేనని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ED
CBI
Vishnu Vardhan Reddy
BJP
Telugudesam
YSRCP
Opposition

More Telugu News