Arun Kumar: రూ.20 కోసం వివాదం హత్యకు దారి తీసింది!

  • అరుణ్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు
  • రూ.50 కోసం డిమాండ్
  • రూ.30 ఇచ్చిన అరుణ్
రూ.20 కోసం చెలరేగిన ఓ వివాదం చివరకు హత్యకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిసోలర్‌లోని పోలీస్ అధికారి రాకేశ్ కుమార్ పాండే మీడియాకు వివరించారు. నేటి తెల్లవారుజామున అరుణ్ కుమార్(22) అనే ట్రక్కు డ్రైవర్, భల్సీ ఇసుక మైన్ నుంచి ఇసుకను తీసుకెళుతుండగా అక్కడి సెక్యూరిటీ గార్డు అడ్డుకుని రూ.50 డిమాండ్ చేశాడు.

అతడికి అరుణ్ రూ.30 మాత్రమే ఇవ్వడంతో మిగిలిన రూ.20 కోసం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డు తన వద్ద ఉన్న తుపాకీతో అరుణ్‌ను కాల్చి వేశాడు. దీంతో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అరుణ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డుతో పాటు మైన్ యజమాని, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Arun Kumar
Rakesh Kumar Pande
Security Guard
Sand
Uttar Pradesh

More Telugu News