JC Diwakar reddy: టీడీపీ మునిగిపోతున్న నావ.. అయినా నేను పార్టీ మారను: జేసీ దివాకర్ రెడ్డి

  • ఇప్పటివరకు కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు
  • జగన్ పనితనం మరో ఆర్నెల్లు పోయాక తెలుస్తుంది
  • బీజేపీ రాష్ట్రంలో బలోపేతం అవుతుందో, లేదో ఇప్పుడే చెప్పలేం

రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు టీడీపీని వీడి కాషాయ కండువాలు కప్పుకోవడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ యాత్రలో ఉన్న సమయంలో తలెత్తిన ఈ సంక్షోభం పార్టీని ఎక్కడికి తీసుకెళుతుందోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ మునిగిపోయే నావే అయినప్పటికీ తాను మాత్రం పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఏ కార్యకర్తల మీటింగ్ పెట్టలేదని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందో, లేదో ఇప్పుడే చెప్పలేమని, మరో ఏడాది సమయం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ పనితనం గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అని, మరో ఆరు నెలల తర్వాత జగన్ పాలన ఎలాంటిదో తెలుస్తుందని అన్నారు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎన్నికల ఫలితాలు వచ్చాక, అందరికంటే ముందు జేసీనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఆయన ఖండించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ పార్టీని వీడి బీజేపీలో చేరడం ద్వారా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.

  • Loading...

More Telugu News