Woman: మహిళను తలపై మోది హత్య చేసిన దుండగులు.. తల్లి శవం పక్కనే పసికందు!

  • భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో హత్య
  • సింతన్‌ను తలపై మోది హత్య చేసిన దుండగులు
  • రాత్రి 8 గంటలకు వచ్చి ఘటనను చూసిన భర్త
గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమారిస్తే, అవేమీ తెలియని ఆరు నెలల పసికందు తల్లి శవం పక్కనే ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన సింతన్‌దేవి యాదవ్(23) అనే మహిళను ఆమె భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో తలపై మోది దుండగులు హత్య చేశారు.

రాత్రి 8 గంటలకు భర్త ఇంటికి వచ్చి చూసే సరికి విగత జీవిగా భార్య, ఆ పక్కనే తన ఆరు నెలల పసిపాప ఉండటం చూసి తీవ్రంగా కలత చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు విచారణ నిర్వహిస్తున్నారు.
Woman
6 Months Baby
Sinthandevi Yadav
Police
Postmartam

More Telugu News