Telugudesam: జాతి నిర్మాణంలో భాగస్వాములం అవుతాం: బీజేపీలో చేరిన సుజనా చౌదరి

  • ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పనిచేయాలనుకున్నా
  • సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలం
  • విభజన చట్టం అమలవుతుందని ఆశిస్తున్నా
టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుజనా చౌదరి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సంఘర్షణ పడటం కంటే సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలమని నమ్ముతున్నామని అన్నారు. విభజన చట్టం పకడ్బందీగా అమలుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నామని, జాతి నిర్మాణంలో భాగస్వాములం అవుతామని అన్నారు. గతంలో ప్రధాని మోదీ కేబినెట్ లో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
Telugudesam
Sujana Chowdary
Bjp
JP Nadda

More Telugu News