Warangal: హైదరాబాద్‌లో మరో దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

  • చిన్నారికి తీవ్ర రక్త స్రావం
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. రామాంతపూర్‌కి చెందిన 9 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం జరపడంతో ఆ చిన్నారికి తీవ్ర రక్త స్రావమైంది. దీనిని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో 9 నెలల పసిపాపపై హత్యాచారం ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

More Telugu News