Telugudesam: వారం రోజుల క్రితమే చంద్రబాబును కలిశా..బీజేపీలో చేరుతున్నా: టీజీ వెంకటేశ్

  • పార్టీని వీడి నష్టం కలిగించొద్దని చెప్పారు
  • ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నా
  • రాజ్యసభ చైర్మన్ కు లేఖ అందజేశాం
టీడీపీని విభేదించి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తమ ప్రాంత అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు.

వారం రోజుల క్రితమే తమ అధినేత చంద్రబాబును కలిశానని చెప్పారు. పార్టీని వీడొద్దని, పార్టీకి నష్టం కలిగించొద్దని తనకు సూచించారని అన్నారు. పార్టీని వీడనున్న ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తను విద్యార్థిగా ఉన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేశానని, తనకు అప్పటి నుంచే బీజేపీతో అనుబంధం ఉందని చెప్పడం గమనార్హం.
Telugudesam
Chandrababu
mp
tg venkatesh
venkaiah

More Telugu News