Telangana: కాపుల సమావేశంపై క్లారిటీ ఇచ్చిన జ్యోతుల నెహ్రూ

  • కాకినాడలో టీడీపీ కాపునేతల సమావేశం
  • అందరిలోనూ సందేహాలు
  • కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరమైందన్న నెహ్రూ

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడిందా? రాబోయే రోజుల్లో టీడీపీకి తీవ్ర నష్టం తప్పదా? అనే సందేహాలు బలంగా వినిపిస్తున్న వేళ, టీడీపీ కాపునేతలు కాకినాడలో రహస్యంగా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరనున్నట్టు ఓవైపు వార్తలు వస్తున్న సమయంలో కాపుల సమావేశం జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ స్పందించారు.

ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించేందుకే సమావేశం జరిగిందని తెలిపారు. కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరం కావడం వల్లే పరాజయం పాలయ్యామని చెప్పారు. కాపులకు, టీడీపీకి మధ్య అంతరానికి గల కారణాలు, నష్టనివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని నెహ్రూ వివరించారు. అంతేతప్ప, తామంతా టీడీపీని వీడుతున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. కాపులకు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లాల్సిన అవసరంలేదని అన్నారు. ఒకవేళ రాజ్యసభ సభ్యులకు కొన్ని పనులు ఉండి వాళ్లు పార్టీ మారొచ్చేమో కానీ, తాము మాత్రం టీడీపీలోనే కొనసాగుతామని తేల్చిచెప్పారు.

More Telugu News