Andhra Pradesh: ఏపీలో టీడీపీ నాయకత్వంపై విశ్వాసం పోయింది: బీజేపీ నేత పురందేశ్వరి

  • చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు
  • ప్రధాని మోదీ విధానాలు వారికి నచ్చాయి
  • బీజేపీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు 
ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ, ఏపీలో టీడీపీ నాయకత్వంపై ఆ పార్టీ కార్యకర్తలకు విశ్వాసం పోయిందని అన్నారు. చాలామంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
Andhra Pradesh
bjp
Chandrababu
purandeswari

More Telugu News