Andhra Pradesh: యలమర్రులో వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొడాలి నాని దంపతుల భూమి పూజ!

  • కృష్ణా జిల్లాలో హోమంలో పాల్గొన్న ఏపీ మంత్రి
  • అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ
  • డీజీపీతో ఫొటోలు దిగిన నాని కుటుంబ సభ్యులు

కృష్ణా జిల్లాలోని యలమర్రులో ఈరోజు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆయన భార్య భూమిపూజ నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య భూమిపూజ క్రతువు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన హోమంలో మంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో నాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాని కుటుంబ సభ్యులు సవాంగ్ తో ఫొటోలు దిగారు.

  • Loading...

More Telugu News