triple talaq: ట్రిపుల్ తలాక్ ను అరికట్టాలన్న రాష్ట్రపతి... రాజ్యసభకు రానున్న బిల్లు

  • ట్రిపుల్ తలాక్, నిఖా హలాలాను అరికట్టాలంటూ రాష్ట్రపతి సూచన
  • అప్పుడే మహిళలకు సమాన హక్కులు లభించనట్టవుతుందంటూ వ్యాఖ్య
  • రాజ్యసభలో ఈరోజు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
ముస్లిం మహిళల పట్ల శాపంగా పరిణమించిన ట్రిపుల్ తలాక్ ను బీజేపీ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ట్రిపుల్ తలాక్ కు చెక్ పెట్టింది.

ఈ రోజు పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు సమానత్వాన్ని కలిగించాలంటే... ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి వాటిని అరికట్టాలని సూచించారు. అప్పుడే మన దేశంలోని మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు లభించినట్టు అవుతుందని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన వెంటనే రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ తలాక్ కు సంబంధించిన బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
triple talaq
nikah halala
Rajyavardhan Singh Rathore
bill

More Telugu News