Andhra Pradesh: చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుంది!: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు

  • టీడీపీలో బానిసత్వం, వారసత్వం
  • దాని నుంచి బయటపడాలని నేతలు కోరుకుంటున్నారు
  • త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన నుంచే ఈ చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలామంది బీజేపీవైపు చూస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వారసత్వం, బానిసత్వం నుంచి బయటపడాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు టీడీపీ నేతలతో బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారన్న వార్తల నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది.
Andhra Pradesh
Telugudesam
Jana Sena
Congress
BJP
vishnuvardhan reddy

More Telugu News