rajasingh: పాతబస్తీలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలు!

  • రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నం
  • రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
  • పోలీసుల లాఠీచార్జ్ లో రాజాసింగ్ కు గాయాలు
హైదరాబాద్, జుమ్మేరాత్ బజార్ లో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి స్థానికులు స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించిన వేళ, ఓ వర్గం వారు దాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకుని, స్థానికులతో కలిసి నిరసనకు దిగారు. మరో వర్గం స్థానికులు వీరిపై రాళ్లురువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా, రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే దాడి చేస్తారా? అని ఈ సందర్భంగా రాజాసింగ్ మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
rajasingh
Hyderabad
Old City
Police

More Telugu News