Kurnool District: టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకుల హల్ చల్!

  • కర్నూలు జిల్లా డోన్ టోల్ ప్లాజా వద్ద ఘటన
  • రుసుం అడిగినందుకు సిబ్బందిపై దాడి
  • పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
ఏపీలో అధికార పార్టీ వైసీపీపై మరో ఆరోపణ తలెత్తింది. కర్నూలు జిల్లా డోన్ టోల్ ప్లాజా వద్ద రుసుం అడిగినందుకు వైసీపీ నాయకులు నానా హంగామా సృష్టించినట్టు తెలుస్తోంది. అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిపై, డాక్టరుపై వైసీపీ కార్యకర్తలు నిన్న దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
Kurnool District
done
YSRCP
toll plaza

More Telugu News