TTD: టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటా: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి

  • సీఎం ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరిస్తా
  • శనివారం మంచిరోజు అని చెబుతున్నారు
  • అదేరోజు ప్రమాణ స్వీకారం చేయనున్న బోర్డు సభ్యులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ గా వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని మీడియా పలకరించింది. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు చెప్పారు. శనివారం మంచిరోజు అని తనకు సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. కాగా, టీటీడీ బోర్డు కొత్తసభ్యులు కూడా అదేరోజున ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం.
TTD
chairman
YV Subba Reddy
ys
jagan

More Telugu News