Hero Naga sourya: హీరో నాగశౌర్యని పరామర్శించిన దర్శకుడు రాఘవేంద్రరావు

  • షూటింగ్ లో ఇటీవల గాయపడ్డ ప్రముఖ హీరో నాగశౌర్య
  • నాగశౌర్య నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావు 
  • అతని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం

విశాఖలోని అరిలోవా ప్రాంతంలో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రముఖ హీరో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వైద్య చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నాగశౌర్యను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పరామర్శించారు. హైదరాబాద్ లోని నాగశౌర్య నివాసానికి ఈరోజు వెళ్లారు. రాఘవేంద్రరావుతో పాటు రచయిత బీవీఎస్ రవి కూడా ఉన్నారు. నాగశౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లిద్దరూ ఆకాంక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ నాగశౌర్యను ఇరవై ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

  • Loading...

More Telugu News